మరికొద్ది గంటల్లో పెళ్లి జరగాల్సిన కల్యాణం అర్ధంతరంగా నిలిచిపోయిన ఘటన ఆదిలాబాద్‌లో చోటు చేసుకుంది. ఏడాది కిందటే ఆమెను పెళ్లాడానని ఓ యువకుడు కోర్టు ఉత్తర్వులతో వివాహాన్ని అడ్డుకున్నాడు. ఆదిలాబాద్ పట్టణం కృష్ణానగర్‌కు చెందిన మాధురిని సంజీవ్ అనే వ్యక్తి ... గత ఏడాది హైదరాబాద్‌లోని ఆర్యసమాజ్‌లో వివాహం చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఆధారాలు చూపాడు. తన భార్యను ఏడాదిగా ఇంట్లోనే బంధించి ఇప్పుడు మరో వివాహం చేస్తున్నారన్న విషయం తెలుసుకుని... తమ పెళ్లికి సంబంధించిన ఆధారాలతో న్యాయవాది, పోలీసుల సహాయంతో ఆదిలాబాద్ పట్టణానికి వచ్చారు.
మరో గంటలో పెళ్లి... భర్త రాకతో ఆగింది.. - ADVOCATE POLICE
సాధారణంగా అబ్బాయికి ఇప్పటికే వివాహం జరిగిందని.. పీటల మీద పెళ్లిళ్లు ఆగిన ఘటనలు చూశాం కానీ.. అమ్మాయికి పెళ్లైందని కల్యాణం ఆగిపోయిన ఘటన ఆదిలాబాద్‌లో జరిగింది. ముహూర్తానికి గంటల ముందు.. భర్త కోర్టు ఉత్తర్వులతో వచ్చాడు. ఇంకేముంది పెళ్లి కూతురు, ఆమె తల్లిదండ్రులు పరారు కావడం.. వచ్చిన బంధువులు అవాక్కవడం జరిగాయి.
![మరో గంటలో పెళ్లి... భర్త రాకతో ఆగింది..](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3132308-thumbnail-3x2-adb.jpg)
నా భార్యను తీసుకెళ్లడానికే ఆదిలాబాద్ వచ్చాను : సంజీవ్
పెళ్లి మధ్యాహ్నం జరగాల్సి ఉండగా..ఉదయమే న్యాయవాది, పోలీసులతో మంటపం వద్దకు చేరుకొని అసలు విషయం చెప్పారు. ఈ ఘటనతో వధువు, ఆమె తల్లిదండ్రులు ఇంటి నుంచి పరారయ్యారు. పెళ్లి ఆగడానికి తానే కారణమంటూ స్థానికులు తమ వాహనంపై దాడిచేశారని సంజీవ్ ఆవేదన వ్యక్తం చేశారు.
పెళ్లి ఆగడానికి నేనే కారణమంటూ స్థానికులు దాడిచేశారు : సంజీవ్
ఇవీ చూడండి : ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు వాయిదా
Last Updated : Apr 28, 2019, 8:26 PM IST