ఆదిలాబాద్ జిల్లాలో 10... జగిత్యాలలో 2 కరోనా కేసులు - coronavirus updates
18:01 April 04
ఆదిలాబాద్ జిల్లాలో 10... జగిత్యాలలో 2 కరోనా కేసులు
ఆదిలాబాద్ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు 10కి చేరాయని డీఎంహెచ్‌వో తెలిపారు. కరోనా బాధితులను హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. బాధితుల కుటుంబసభ్యులను క్వారంటైన్‌కు తరలించారు. ఆదిలాబాద్ జిల్లాలో మరో 25 మంది నివేదికలు రావాల్సి ఉందని డీఎంహెచ్‌వో తెలిపారు.
జగిత్యాల జిల్లాలో ఇవాళ కొత్తగా 2 కేసులు నమోదయ్యాయి. బాధితులను క్వారంటైన్ నుంచి గాంధీ ఆస్పత్రికి తరలించినట్లు కలెక్టర్ తెలిపారు. జగిత్యాలలో క్వారంటైన్‌లో ఉన్న 73 మందిలో 43 మందికి నెగటివ్ వచ్చినట్లు పేర్కొన్నారు.