తెలంగాణ

telangana

ETV Bharat / state

చరవాణిలో వైద్యసేవలు.. చెంతకే ఔషధాలు - Adilabad Corona Effect

కరోనా వ్యాధి నియంత్రణ కోసం టెలీ మెడిసిన్‌ అనే కార్యక్రమాన్ని ఆదిలాబాద్‌ జిల్లా యంత్రాంగం ప్రారంభించింది. జిల్లా పాలనాధికారి శ్రీదేవసేన ఆదేశాలతో కలెక్టరేట్‌లో ఓ వైద్యుడు, ఆయనకు ఓ అసిస్టెంట్‌తో టెలీమెడిసిన్‌ విభాగం ఏర్పాటుచేశారు. మెడికల్‌ దుకాణాల వాట్సాప్‌ నంబర్లను ప్రకటించారు.ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకుండా వారి చెంతకే ఔషధాలు చేరేలా ఏర్పాట్లు చేశారు.

టెలీ మెడిసిన్‌ విభాగంలో డా. అభిజిత్‌, సహాయకుడు గజానన్‌
టెలీ మెడిసిన్‌ విభాగంలో డా. అభిజిత్‌, సహాయకుడు గజానన్‌

By

Published : Mar 30, 2020, 12:28 PM IST

ఆదిలాబాద్‌ జిల్లాలో ప్రజలకు వైద్య సహాయమందించేందుకు జిల్లాయంత్రాగం టెలీ మెడిసిన్‌ కార్యక్రమాన్ని మొదలెెట్టింది. కలెక్టరేట్‌లో టెలీ మెడిసిన్‌ విభాగాన్ని ప్రారంభించి ఓ వైద్యుడు, ఆయనకు ఓ అసిస్టెంట్‌ను ఏర్పాటు చేశారు. దీని కోసం ప్రత్యేకంగా ఫోన్‌ నంబర్‌ : 08732-231850 కేటాయించారు.

ఆదివారం ప్రారంభమైన టెలీమెడిసిన్‌లో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఆదిలాబాద్‌కు చెందిన వైద్యుడు అభిజిత్‌ నూగర్‌వార్‌... మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు రిమ్స్‌ వైద్యుడు శ్రీకాంత్‌లు ప్రజల సందేహాలకు సమాధానాలిచ్చారు. జిల్లా వ్యాప్తంగా ఎక్కడి నుంచైనా ఫోన్‌ చేసే వీలు కల్పించారు. ప్రభుత్వ వైద్యులతోపాటు ప్రైవేటు వైద్యుల సేవలను వినియోగించుకునే ఏర్పాట్లు చేశారు. తొలిరోజు మధ్యాహ్నం 16 ఫోన్‌ కాల్స్‌ వచ్చాయి.

ఇంటి వద్దకే ఔషధాలు...

అత్యవసర మందులు అవసరమైన వారికి ఇంటి వద్దకే అందించే ఏర్పాట్లను ఔషధ నియంత్రణ శాఖ చేసింది. పలు ఔషధ దుకాణాల వాట్సాప్‌ సంఖ్యలను జిల్లా ఔషధ నియంత్రణ అధికారి వంగపల్లి శ్రీకాంత్‌ విడుదల చేశారు.

ఆదిలాబాద్‌ పట్టణంలో మెడ్‌ప్లస్‌(రాజేందర్‌-99498 03040), అపోలో ఫార్మసీ(శ్రీనివాస్‌-99489 11598), ఉట్నూర్‌లో మణికంఠ మెడికల్‌(హరీష్‌-81066 61999), ఇచ్చోడలో మహేష్‌ మెడికల్‌(మహేష్‌-94933 35334), ఈశ్వరసాయి మెడికల్‌(మహేందర్‌-98487 76024), దేవీ మెడికల్‌(విజయ్‌-94404 39611), ఇంద్రవెల్లిలోని మమత మెడికల్‌(ప్రకాష్‌-84659 55441) బోథ్‌లో సాయికృష్ణ మెడికల్‌(జగదీష్‌-81850 82069), నేరడిగొండలో సాయికృప మెడికల్‌(ప్రసాద్‌-96524 29900) వారు ఇంటి వద్దకే ఔషధాలు అందిస్తారన్నారు.

ఆదిలాబాద్‌, ఉట్నూర్‌, ఇచ్చోడ ప్రాంతాల్లో అత్యవసరంగా ఔషధాలు కావలసిన వారు వైద్యులు రాసిన చీటీ(ప్రిస్క్రిప్షన్‌)ని ఫొటో తీసి వాట్సాప్‌ సంఖ్యలకు పంపించాలన్నారు. చిరునామా వివరాలను పేర్కొంటే... ఇంటి వద్దకు మందులను తీసుకువచ్చి అందజేస్తారని చెప్పారు.

ఇదీ చూడండి:'అదుపులోనే ఉంది.. అయినా మరో మూడువారాలు తప్పదు'

ABOUT THE AUTHOR

...view details