తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదిలాబాద్‌లోని కలెక్టర్ కార్యాలయం వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. అంతకుముందు భాజపా ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయ అవరణలో పాయల్ శంకర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు.
కలెక్టరేట్లో తెలంగాణ విమోచన దినోత్సవం - telangana liberation day celebrations 2020
ఆదిలాబాద్‌లో కలెక్టరేట్లో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని భాజపా నాయకులు పాయల్ శంకర్ జాతీయ జెండాను ఎగురవేశారు. భాజపా అధికారంలోకి వచ్చాక అధికారికంగా సంబురాలు జరుపుతామని ఆయన తెలిపారు.
జిల్లా కలెక్టరేట్లో తెలంగాణ విమోచన దినోత్సవం
నిజాం నిరంకుశ పాలన నుంచి తెలంగాణ ప్రజలు విముక్తి పొందడానికి పోరాడి అమరులైన వారికి జోహార్లు అంటూ నినాదాలు చేశారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా ప్రకటించకపోవడం వల్ల భాజపా నేతలు.. ప్రభుత్వ తీరును దుయ్యబట్టారు. భాజపా అధికారంలోకి వచ్చాక అధికారికంగా సంబురాలు జరుపుతామని పాయల్ శంకర్ తెలిపారు.