ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండల కేంద్రంలో లంబాడ ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన తీజ్ ముగింపు వేడుకల్లో జడ్పీ ఛైర్మన్ రాథోడ్ జనార్దన్, ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్, బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు పాల్గొన్నారు. గిరిజన పాటలకు అనుగుణంగా సామూహిక నృత్యాలు చేశారు. తీజ్ ఆడబిడ్డల పండగ అని.. గిరిజన సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే తీజ్ ఉత్సవాల ముగింపు రోజున ప్రభుత్వం సెలవు ప్రకటించాలని రేఖా నాయక్ కోరారు.
తీజ్ ఆడబిడ్డల పండగ: ఎమ్మెల్యే రేఖా నాయక్ - తీజ్
ఆదిలాబాద్ జిల్లాలో లంబాడ ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో తీజ్ ఉత్సవ ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో పలువురు నేతలు పాల్గొన్నారు.
తీజ్ ఆడబిడ్డల పండగ: ఎమ్మెల్యే రేఖా నాయక్