ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న 13 ఏళ్ల బాలికపై అదే పాఠశాలలో విద్యాబుద్ధులు నేర్పుతున్న ఉపాధ్యాయుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆదివారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరు లేని సమయాన ఓ ప్రైవేటు పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న శ్రీకాంత్ బాలిక ఉన్న ఇంట్లో చొరబడ్డాడు. ఉపాధ్యాయుడు బాలికపై అత్యాచారానికి ప్రయత్నిస్తున్న సమయంలో పొలం పనులకు వెళ్లిన తండ్రి ఇంటికి రావడం వల్ల ప్రబుద్ధుడు పరారయ్యాడు. బాలిక తండ్రి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదుచేసి నిందితుడిని త్వరలోనే పట్టుకొని చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
అత్యాచారానికి యత్నించిన కీచక ఉపాధ్యాయుడు - అత్యాచారానికి యత్నించిన కీచక ఉపాధ్యాయుడు
చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడే ఓ బాలికపై అత్యాచారానికి యత్నించిన ఘటన ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలో చోటుచేసుకుంది.
కీచక ఉపాధ్యాయుని కోసం గాలిస్తున్న పోలీసులు