ఇచ్చోడలో ఉపాధ్యాయుల ఆందోళన - ఇచ్చోడలో ఉపాధ్యాయుల ఆందోళన
సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడలో టీపీఆర్టీయూ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు నిరసన చేపట్టారు.
ఇచ్చోడలో ఉపాధ్యాయుల ఆందోళన
ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో ఎమ్మార్సీ భవన ప్రాంగణంలో ఉపాధ్యాయులు నిరసన చేపట్టారు. టీపీఆర్టీయూ ఆధ్వర్యంలో పలు సమస్యలపై నిరసన చేపట్టారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యా పరమైన సమస్యలను వెంటనే పరిష్కరించాలని టీపీఆర్టీయూ ప్రధాన కార్యదర్శి నూర్ సింగ్ డిమాండ్ చేశారు. సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరారు.