ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు తీసులోవాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేసింది. ఈ మేరకు అదనపు కలెక్టర్ సంధ్యారాణికి వినతి పత్రం అందించింది. జిల్లాలో ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు కొవిడ్ సమయంలో కూడా విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అధిక ఫీజులు వసూలు చేశారని జిల్లా కార్యదర్శి అన్నమొల్ల కిరణ్ అన్నారు.
విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలి: ఎస్ఎఫ్ఐ - sfi latest news
అధిక ఫీజులు వసూలు చేస్తున్న విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ కోరింది. అదనపు కలెక్టర్ సంధ్యారాణికి వినతి పత్రం అందించింది.

విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలి: ఎస్ఎఫ్ఐ
అలాంటి ప్రైవేట్ పాఠశాలలపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అవసరమైతే పాఠశాలలను సీజ్ చెయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు ఆత్రం నగేశ్ పాల్గొన్నారు.
ఇవీచూడండి:దారుణం: ఆడపిల్లలు పుట్టారని పురుగులమందు తాగించిన తండ్రి