ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో గిరిజన బాలుర గురుకుల పాఠశాల విద్యార్థులు స్వచ్ఛ పక్వాడా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చీపుర్లతో జాతీయ రహదారిని ఊడ్చారు. డ్రైనేజీ వద్ద పేరుకుపోయిన చెత్తను సేకరించారు. ప్రతి శుక్రవారం ఒక గంట స్వచ్ఛత పక్వాడా కార్యక్రమాన్ని నిర్వహించి గ్రామంలో పారిశుద్ధ్యాన్ని మెరుగు పరిచేందుకు కృషి చేస్తున్నట్లు విద్యార్థులు పేర్కొన్నారు.
గ్రామంలోని డాక్టర్ అంబేడ్కర్, కొమరం భీమ్, శివాజీ, బాబు జగ్జీవన్ రావు, విగ్రహాలను నీళ్లతో శుభ్రపర్చి.. పూలమాలలు వేశారు. గ్రామం పరిశుభ్రంగా ఉండాలని అందుకు అందరు భాగస్వాములు కావాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ రాజేంద్ర ప్రసాద్, వైస్ ప్రిన్సిపల్ నాగేశ్వరరావు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఇచ్చోడలో విద్యార్థుల 'స్వచ్ఛత పక్వాడ' - ఆదిలాబాద్ తాజా వార్త
ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ కేంద్రంలో విద్యార్థులు స్వచ్ఛ పక్వాడా కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామాన్ని శుభ్రపర్చేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని కోరారు.
ఇచ్చోడలో విద్యార్థుల 'స్వచ్ఛత పక్వాడ'
ఇదీ చూడండి: 'మూసీ ప్రక్షాళన' కోసం అనంతగిరికి భాజపా ర్యాలీ