ఆదిలాబాద్ జిల్లాలో ఎండల తీవ్రత పెరిగింది. మొన్నటి వరకు కరోనా భయంతో బయటకు రావడానికి భయపడిన జనం.. ఇప్పుడు ఎండల వేడికి బయటకు రావాలంటే భయపడుతున్నారు. రెండు రోజుల క్రితం 41.3 డిగ్రీలు నమోదైన ఉష్ణోగ్రతలు.. ఇప్పుడు 44 డిగ్రీలకు పెరిగింది.
ఆదిలాబాద్లో భానుడి భగభగలు - summer Effect
మొన్నటి దాకా కరోనా భయంతో బయటకు రావడానికి భయపడిన జనాలు.. ఇప్పుడు ఎండ వేడిమికి అడుగు బయట పెట్టాలంటే జంకుతున్నారు. భగభగ మండుతున్న ఎండలకు జనసంచారం కనిపించకుండా రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారిపోయాయి.
![ఆదిలాబాద్లో భానుడి భగభగలు Summer Effect In Adilabad District](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7306066-566-7306066-1590153811201.jpg)
ఆదిలాబాద్లో.. అదరగొడుతున్న ఎండలు!
ఆదిలాబాద్ సహా.. ఉట్నూరు, బోథ్, ఇచ్చోడ కేంద్రాల్లో జన సంచారమే లేదు. ఎండలతో పాటు.. వేడిగాలులు వీస్తూ.. జనాలు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు.
ఇదీ చూడండి: పెళ్లికొచ్చిన బంధువులు నెల రోజులుగా టెంట్ల కిందే!