ఆసుపత్రి భవనం నుంచి దూకేశాడు.. - adilabad
కుటుంబసభ్యులకు భారమనుకున్నాడో... లేక కడపు నొప్పి భరించలేకపోయాడో... ఒక వ్యక్తి ఆసుపత్రి భవనం నుంచి దూకేశాడు. చికిత్స కోసం వచ్చి అక్కడే తనువు చాలించాడు.
రోగి ఆత్మహత్య
ఆదిలాబాద్‌లోని రిమ్స్ ప్రభుత్వ కళాశాలలో మూడో అంతస్తు నుంచి దూకి రోగి ఆత్మహత్య చేసుకున్నాడు. సిబ్బంది హుటాహుటిన అత్యవసర విభాగానికి తరలించారు. కానీ... చికిత్స పొందుతూ రోగి ప్రాణాలు విడిచాడు. మృతుడు తలమడుగు మండలం కజ్జర్లవాసి నారాయణగా గుర్తించారు. కొంత కాలంగా అతను కడుపునొప్పి, వాంతులతో బాధపడుతున్నట్లు వైద్యులు వెల్లడించారు. మూడు రోజుల క్రితమే ఆసుపత్రిలో చేరాడని తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.