ఒకరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు. మరొకరు ప్రభుత్వ ఛాత్రోపాధ్యాయ కళాశాల అధ్యాపకుడు. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఈ ఇద్దరూ.. విద్యార్థి కేంద్ర బిందువుగా బోధనలు చేశారు.
విద్యార్థే కేంద్ర బిందువుగా పనిచేశారు... అవార్డు పొందారు - రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డుల వార్తలు
రాష్ట్రంలోనే తొలిసారిగా ఆన్లైన్లో పాఠ్యాంశాలు ప్రారంభించి... విద్యార్థే కేంద్రబిందువుగా చదువు చెబుతూ.. విద్యార్థులను తీర్చిదిద్దుతున్న ఉపాధ్యాయులను ప్రభుత్వం గుర్తించింది. విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంపొందించడం కోసం వాళ్లు ఏం చేశారంటే...
అంతేకాకుండా రాష్ట్రంలోనే... తొలి ఆన్‌లైన్ పాఠ్యాంశాల బోధనకు శ్రీకారం చుట్టారు. కస్తూర్భా గాంధీ విద్యాలయాల్లోని ఆరోతరగతి బాలికల్లో ఆంగ్లం, తెలుగు విషయాల్లో నైపుణ్యాలు పెంపొందించడం కోసం 40 రోజుల పాటు రెసిడెన్షియల్ విధానాన్ని అమలు చేసి.. రాష్ట్రస్థాయి గుర్తింపు పొందారు. ఫలితంగా రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయులుగా అవార్డులకు ఎన్నికయ్యారు. ఆదిలాబాద్ జిల్లా పాలనాధికారి చేతుల మీదుగా నేడు సత్కారం పొందిన ఆ ఉపాధ్యాయులతో ఈటీవీ భారత్ ముఖాముఖి.
ఇదీ చూడండి:'ఆ పురస్కారాన్ని పేద విద్యార్థులకే అంకితమిస్తాను'