తెలంగాణ

telangana

ETV Bharat / state

'గోదావరి పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలి'

సుప్రీంకోర్టు తీర్పు ఆదేశాల మేరకు ఇవాళ బాబ్లీ ప్రాజెక్టు గేట్లను తెరిచారని ఎస్సాఆర్​ఎస్పీ ఎగ్జిక్యూటివ్​ రామారావు తెలిపారు. తెలంగాణ సరిహద్దు బాసర గోదావరి పరివాహక ప్రజలు, చేపల వేటకు వెళ్లే వారు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

By

Published : Jul 1, 2020, 2:32 PM IST

srsp Executive Engineer ramarao talk about dharmabad babli project gates
'గోదావరి పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలి'

సుప్రీంకోర్టు తీర్పు ఆదేశాల మేరకు బుధవారం బాబ్లీ ప్రాజెక్టు గేట్లను కృష్ణ, గోదావరి బేసిన్​ ఆర్గనైజేషన్​ కేంద్ర జల సంఘం సభ్యుల ఆధ్వర్యంలో ఎత్తారు. మహారాష్ట్ర ప్రభుత్వం ధర్మాబాద్​ సమీపంలో నిర్మించిన గేట్లను సీడబ్ల్యూసీ అధికారుల సమక్షంలో తెరిచారు.

ప్రతిఏటా జులై 1న బాబ్లీ గేట్లు ఎత్తాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో పేర్కొంది. ప్రాజెక్టు గేట్లను తిరిగి అక్టోబర్​ 28న ఇరు రాష్ట్రాల అధికారులు మూసివేస్తారు. ప్రస్తుతం బాబ్లీ ప్రాజెక్టులో 0.62 టీఎంసీల నీరు ఉందని.. నీటిని విడుదల చేస్తున్నందున దిగువ తెలంగాణ సరిహద్దు బాసర గోదావరి పరివాహక ప్రజలు, చేపల వేటకు వెళ్లే మత్యకారులు అప్రమత్తంగా ఉండాలని ఎస్సారెస్పీ అధికారులు సూచించారు. సాయంత్రానికల్లా మొత్తం 14 గేట్లు ఎత్తివేస్తామని అన్నారు.

'గోదావరి పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలి'

ABOUT THE AUTHOR

...view details