తెలంగాణ

telangana

ETV Bharat / state

ఇది ప్రాథమిక ఆరోగ్య కేంద్రమే.. వసతుల్లో మాత్రం కార్పొరేట్ స్థాయి మించిపోతోంది..

Bhimpur Primary Health Centre: ప్రభుత్వ ఆసుపత్రిలంటే చాలు నాసిరకం వైద్యంతో నామమాత్రపు సేవలందిస్తుంటారని ప్రజలు జంకుతుంటారు. చేసేదేంలేక ప్రైవేట్‌ ఆసుపత్రిలకెళ్లి జేబులు ఖాళీ చేసుకుంటారు. అయితే ఆదిలాబాద్‌ జిల్లాలోని ఓ ప్రాథమిక ఆరోగ్యకేంద్రం మాత్రం కార్పొరేట్‌ ఆసుపత్రుకు ధీటుగా సేవలందిస్తుంది. ఆధునాతన వసతులతో కచ్చితమైన ప్రమాణాలు పాటిస్తూ జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది.

Bhimpur Primary Health
Bhimpur Primary Health

By

Published : Oct 31, 2022, 3:27 PM IST

ఆదిలాబాద్‌ జిల్లా భీంపూర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం

Bhimpur Primary Health Centre: ఈ మధ్య కాలంలో ప్రభుత్వఆసుపత్రిలలో జరిగిన ఘటనల రీత్యా ప్రజలకు వాటి మీద నమ్మకం సన్నగిల్లుతుంది. జేబులు ఖాళైన సరే ప్రైవేట్‌ ఆసుపత్రిలలోనే చికిత్సే మేలు అనుకుంటున్నారు. అయితే ఆదిలాబాద్‌ జిల్లా భీంపూర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మాత్రం దీనికి పూర్తిగా మినహాయింపు అని చెప్పవచ్చు. కార్పొరేట్ ఆసుపత్రుల స్థాయి వసతులు కల్పిస్తూ ఆసుపత్రికి వచ్చే రోగులపట్ల ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు.

ఎప్పటికప్పుడు వైద్య సేవలు అందిస్తూ రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎంతో చక్కగా వివరిస్తున్నారు. గర్భం దాల్చినప్పటి నుంచి ప్రసవ సమయం వరకు గర్భిణీలను కంటికిరెప్పలా కాపాడుతున్నారు. రక్తహీనతతో బాధపడే వారికి ఐరన్‌ పెంపొందించేలా ప్రత్యేక చొరవ చూపుతూ ఆసుపత్రిలోనే వారికి సపర్యలు చేస్తున్నారు. అంతే కాకుండా పరీక్షలకై ఆసుపత్రికి వచ్చిన గర్భిణిలకు మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు.

ఆధునాతన బెడ్స్‌, ఆపరేషన్ థియేటర్, లేబొరేటరీతో పాటు మరెన్నో సౌకర్యాలు ఆసుపత్రిలో అందుబాటులో ఉన్నాయి. అత్యవసర పరిస్థితుల్లో రోగులను తీసుకురావడానికి ఒక 102 వాహనంతోపాటు , రెండు అంబులెన్సులను ఆసుపత్రి సిబ్బంది ఎప్పుడూ సిద్ధంగా ఉంచుతారు. గర్భిణీలకు ఎవైనా ఆరోగ్యసమస్యలు తలెత్తితే రిమ్స్ వైద్యులతో వీడియో కాల్ ద్వారా మాట్లాడించి పరిష్కారం చూపుతారు.

ఈ ఆసుపత్రి సేవలకు గాను ఉమ్మడి రాష్ట్రంలోనే తొలి ఉత్తమ ఆసుప్రతిగా కేంద్ర ప్రభుత్వం కాయకల్ప పురస్కారం అందించింది. అంతేకాకుండా కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ తాజాగా ఎన్కాస్ అవార్డు ఇవ్వడంతో భీంపూర్‌ పీహెచ్​సీ మరోమారు వార్తల్లోకెక్కింది. కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా ఈ వైద్యం అందిస్తోంది భీంపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం. అత్యుత్తమ సేవలు అందిస్తూ పలు ఆసుపత్రిలకు ఆదర్శంగా నిలుస్తోంది.

"ఎయిమ్స్​లో లభించే అన్ని సేవలు ఇక్కడ లభిస్తాయి. హెచ్​ఐవీ, షుగర్​, థైరాయిడ్​ ఇలా చాలా పరీక్షలు ఇక్కడ చేస్తాం. మరికొన్ని టీహబ్​కు పంపిస్తాం. ప్రైవేట్​లో ఆసుపత్రులో లభించే అన్ని సేవలు ఇక్కడ అందిస్తాం".- శ్రీదేవి, ల్యాబ్ టెక్నీషియన్

"ఉమ్మడి రాష్ట్రంలోనే తొలి ఉత్తమ ఆసుప్రతిగా కేంద్ర ప్రభుత్వం కాయకల్ప పురస్కారం అందించింది. అంతేకాకుండా కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ తాజాగా ఎన్కాస్ అవార్డు కూడా ప్రకటించింది. ఎయిమ్స్​ ప్రమాణాలకు అనుగుణంగా ఇక్కడ అన్ని ప్రమాణాలు పాటిస్తున్నాం".- డా. విజయ సారథి, మెడికల్ ఆఫీసర్

"ఇక్కడ డాక్టర్లు చాలా మంచి వారు. మమ్మల్ని నేరుగా ఇంటికి నుంచి తీసుకొచ్చి మరల ఇంటికి పంపేవరకు ఇక్కడ సిబ్బంది చాలా జాగ్రర్త వహిస్తారు. మాకు పైసా ఖర్చు లేకుండా వైద్యం చేస్తారు. అందుకే ఈ ఆసుపత్రికి రావడానికి చాలా మంది ఇష్టపడుతున్నాం".- వైద్యం కోసం వచ్చిన మహిళ

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details