రాష్ట్రంలో కరోనా మహమ్మారి నియంత్రణ కోసం రూ.7650 కోట్ల నిధులు కేంద్రం విడుదల చేస్తే రాష్ట్ర ప్రభుత్వం దాచిపెడుతుందని ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు ఆరోపించారు. కరోనా విధులు నిర్వహించిన వైద్యులు, వైద్య సిబ్బందికి రూ.50 లక్షల బీమా సౌకర్యం కల్పించింది కూడా కేంద్రమేనని స్పష్టం చేశారు. కేంద్రం చేసిన సాయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఆ నిధుల వివరాలు తెలపాలని తెరాస నాయకులకు సవాల్ విసిరారు.
'కేంద్రం నిధులు ఎంత మేరకు ఖర్చు చేశారో తెలపాలి' - కేంద్రం రూ.7650 కోట్ల నిధులు తెలంగాణకు విడుదల
రాష్ట్రానికి కరోనాసాయం కింద కేంద్రం రూ.7650 కోట్ల నిధులు విడుదల చేస్తే వాటిని దాచిపెడుతున్నారని ఎంపీ సోయం బాపూరావు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్య సిబ్బందికి రూ.50 లక్షల బీమా పథకం కూడా కేంద్రానిదే అని అన్నారు. ఆ నిధులు ఎంతమేరకు ఖర్చు చేశారో తెలపాలని డిమాండ్ చేశారు.

'కేంద్రం నిధులు ఎంత మేరకు ఖర్చు చేశారో తెలపాలి'
అబద్ధమైతే వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రపంచమంతా విజ్ఞానం వైపు చూస్తుంటే.. మూఢనమ్మకాల పేరుతో సీఎం కేసీఆర్ చారిత్రాత్మకమైన సచివాలయం కూల్చివేయించారని ధ్వజమెత్తారు.
'కేంద్రం నిధులు ఎంత మేరకు ఖర్చు చేశారో తెలపాలి'
ఇదీ చూడండి :చెత్త ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారా?.. అయితే జాగ్రత్త!