పాకిస్తాన్‌లో మైనార్టీలుగా ఉన్న హిందువులపై దాడులు చేస్తే చూస్తూ ఊరుకోబోమని, దేశంలో భాజపా నేతృత్వంలో హిందువుల తడాఖా చూపిస్తామని ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదిలాబాద్‌లో భాజపా ఆధ్వర్యంలో పౌరసత్వ చట్టానికి అనుకూలంగా నిర్వహించిన భారీ ర్యాలీలో ఆయన చేసిన కామెంట్లు కలకలం రేపుతున్నాయి.
'హిందువుల తడాఖా చూపిస్తాం': ఎంపీ బాపురావు - ఆదిలాబాద్ తాజా వార్త
పాకిస్తాన్‌లో హిందువులపై చేసే దుశ్చర్యలను చూస్తూ ఊరుకోబోమని..భాజపా ఆధ్వర్యంలో హిందువుల తఢాఖా చూపిస్తామని ఎంపీ సోయం బాపురావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదిలాబాద్‌లో సీఏఏకు మద్దతుగా ఏర్పాటు చేసిన భారీ ర్యాలీ ఆయన పాల్గొన్నారు.
'హిందువుల తడాఖా చూపిస్తాం': ఎంపీ బాపురావు
కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ, ముఖ్యమంత్రి కేసీఆర్‌లు ఎంతమంది పుట్టుకొచ్చినా పౌరసత్వ సవరణ చట్టం వెనక్కి తీసుకోబోయేది లేదని ఎంపీ స్పష్టం చేశారు. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో... భాజపా అభ్యర్థులను గెలిపించి... ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనను ఫామ్‌హౌజ్‌కు పరిమితం చేయాలని పిలుపునిచ్చారు.
ఇదీ చూడండి: ఎన్ఆర్సీ, సీఏఏ, ఎన్పీఆర్లపై గళమెత్తిన ముస్లింలు