తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆదిలాబాద్​ రైల్వే స్టేషన్​కు దక్షిణ మధ్య రైల్వే జీఎం - railway gm gajanan malya visit adilabad

ఆదిలాబాద్​ రైల్వే స్టేషన్​ను దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్​ మాల్యా సందర్శించి పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. త్వరలో బెంగళూరుకు రైలును ప్రారంభిస్తామన్నారు.

south central railway gm gajanan malya visit adilabad railway station
ఆదిలాబాద్​ రైల్వే స్టేషన్​ను సందర్శించిన దక్షిణ మధ్య రైల్వే జీఎం

By

Published : Dec 13, 2019, 4:32 PM IST

దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్యా ఆదిలాబాద్ రైల్వే స్టేషన్​ను సందర్శించారు. రైల్వే స్టేషన్​లో పలు అభివృద్ధి పనులు ప్రారంభించిన ఆయన... రైల్వే సిబ్బంది నివాసాలను పరిశీలించారు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న, భాజపా జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్, ఇతర సంఘాల నాయకులు ఆయా సమస్యలపై వినతి పత్రాలు అందజేశారు. త్వరలో బెంగళూరుకు రైలును ప్రారంభిస్తామని దక్షిణ మధ్య రైల్వే జీఎం తెలిపారు. రైల్వే లైను సామర్థ్యాన్ని మెరుగుపరిచి వేగాన్ని పెంచుతామని వెల్లడించారు.

ఆదిలాబాద్​ రైల్వే స్టేషన్​ను సందర్శించిన దక్షిణ మధ్య రైల్వే జీఎం

ABOUT THE AUTHOR

...view details