చొరవచూపే నాయకత్వం... ఐక్యతను చాటే ప్రజానీకం ఉంటే... మారుమూల ప్రాంతంలోనూ అనుకున్నది సాధించవచ్చు. ప్రభుత్వం కేటాయించే నిధులతో పాటు అదనంగా మరో రూ.5 లక్షలు వెచ్చించి ఆదిలాబాద్ జిల్లా సొనాల గ్రామంలో చేపట్టిన రైతు వేదిక నిర్మాణం.. రాష్ట్రంలోనే నమూనాగా నిలుస్తోంది.
ఒక్కసారైనా సొనాల 'రైతు వేదిక' చూడాల్సిందే..! - ఆదిలాబాద్ జిల్లా సొనాల గ్రామంలో ఆకట్టుకున్న రైతు వేదిక
ఆదిలాబాద్ జిల్లా సొనాల గ్రామంలోని రైతు వేదిక.. స్థానిక నాయకత్వం చొరవ, ఐకత్యకు అద్దం పడుతోంది. ప్రభుత్వం కేటాయించిన నిధులతో పాటు అదనంగా మరో రూ.5 లక్షలు వెచ్చింది.. రాష్ట్రంలోనే నమూనాగా నిలిచేలా రైతు వేదిక నిర్మాణం చేపట్టారు.
ఒక్కసారైనా ఆదిలాబాద్ జిల్లాలోని సొనాల 'రైతు వేదిక' చూడాల్సిందే..!
ప్రభుత్వ మార్గదర్శకాల్లో రైతు వేదికల దగ్గర నీటి వసతి ప్రస్తావన లేకపోయినా 150 అడుగల బోరువేసి నీటి వసతి సమకూర్చారు. మండలాధ్యక్షుడి చొరవ... గ్రామస్థుల ప్రోత్సాహంతో నమూనగా రూపుదిద్దుకున్న రైతు వేదిక విశేషాలపై ఈటీవీ భారత్ ప్రతినిధి మణికేశ్వర్ ముఖాముఖి..