ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోని కన్నాపూర్ అటవీ ప్రాంతంలో నివసిస్తున్న ఓ గిరిజన అవ్వకు పలువురు ఆసరాగా నిలుస్తున్నారు. ఏజన్సీ ప్రాంతంలో 30 ఏళ్లుగా అరణ్యవాసం చేస్తున్న గిరిజాబాయ్కి మేమున్నామంటూ పలకరిస్తూ ముందుకొచ్చారు. ఈనాడు పత్రిక ప్రచురించింన కథనానికి మంచి స్పందన లభించింది. వార్త చదివి కాపర్లకు చెందిన శ్రీనివాస్, మామడకు చెందిన మరో ఉపాధ్యాయుడు గిరిజాబాయ్కు తమ వంతు సాయం చేయాలని కాంక్షించారు. నిత్యావసర వస్తువులతో పాటు గుడిసె పైకప్పు వేసుకునేందుకు వీలుగా పాలిథిన్ కవర్లను అందించారు. బట్టలు, సబ్బులు, చక్కెర, చాయ్పత్తితో పాటు పలు వస్తువులు అందించి ఉడతా సాయం చేసి అవ్వ కళ్లలో ఆనందం చూశారు.
అడవిలో అవ్వకు ఆసరాగా నిలుస్తున్న యువకులు - కన్నాపూర్ అటవీ ప్రాంతం
ముప్పై ఏళ్లుగా అరణ్య వాసం చేస్తున్న ఆమెకు ఆసరాగా నిలిచేందుకు కొందరు ముందుకొచ్చారు. కష్టాలు చెప్పుకునేందుకు ఎవ్వరూ లేక ఒంటరి జీవితం గడుపుతున్న అవ్వకు చుట్టాలం మేమున్నామంటూ... పలకరిస్తున్నారు. ఈనాడులో ప్రచురితమైన కథనానికి మంచి స్పందన లభిస్తోంది.
అడవిలో అవ్వకు ఆసరాగా నిలుస్తున్న యువకులు