ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసరలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వేసవి సెలవులు ముగిసి బడులు ప్రారంభమైనందున... ఇప్పుడే పలకాబలపం పట్టే చిన్నారులకు అక్షరాభ్యాసం చేయిస్తున్నారు. సరస్వతీ దేవి ఆశీస్సుల కోసం వేకువజాము నుంచే ఆలయంలో బారులు తీరారు. భక్తుల తాకిడి పెరిగినందున అమ్మవారి దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. రాష్ట్రం నుంచే కాకుండా మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా భక్తులు బాసరకు తరలివస్తున్నారు.
అమ్మవారి చెంత అక్షరాభ్యాసం... పెరిగిన భక్తుల రద్దీ - అమ్మవారి చెంత అక్షరాభ్యాసం
ఈ సంవత్సరమే పలకాబలపం పట్టబోయే బుజ్జాయిలకు అమ్మవారి ఒడిలో అక్షరాలు దిద్దించాలని బాసరకి పోటెత్తుతున్నారు. భక్తుల తాకిడి పెరిగినందున అమ్మవారి దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది.
అమ్మవారి చెంత అక్షరాభ్యాసం... పెరిగిన భక్తుల రద్దీ