ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆదిలాబాద్ జిల్లాలో భాజపా నాయకులు చేపట్టిన ధర్నా ఉద్రిక్తతకు దారితీసింది. కలెక్టరేట్ ముందు శాంతియుతంగా ధర్నా నిర్వహించిన భాజపా శ్రేణులు.. ఒక్కసారిగా కలెక్టరేట్ భవనంలోకి దూసుకెళ్లారు.
ఉద్రిక్తతకు దారితీసిన భాజపా నాయకుల ఆందోళన - ధర్నాలో ఉద్రిక్తత వార్తలు
ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ భాజపా నాయకులు చేపట్టిన ఆందోళన స్వల్ప ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది.

ఉద్రిక్తతకు దారితీసిన భాజపా నాయకుల ఆందోళన
ప్రధాన ద్వారం వద్ద ఉన్న పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తోపులాట జరగటంతో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టడంతో వివాదం సద్దుమణిగింది.
ఇదీ చూడండి:వాడరేవులో ఉద్రిక్తత.. కర్రలు, కత్తులతో పరస్పర దాడులు