ఆరో విడత హరితహారం కార్యక్రమంలో ప్రతిఒక్కరూ మొక్కలు నాటి వాటిని కాపాడాలని ఆదిలాబాద్ జిల్లా పాలనాధికారి శ్రీ దేవసేన పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ నాగోబా ఆలయంలో హరితహారం కార్యక్రమం చేపట్టారు. ముందుగా జిల్లా కలెక్టర్ నాగోబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
మొక్కల పెంపకం ప్రతిఒక్కరి బాధ్యత: కలెక్టర్ శ్రీ దేవసేన - nagoba temple latest news
ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని కాపాడాలని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ శ్రీ దేవసేన కోరారు. ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ నాగోబా ఆలయ ప్రాంగణంలో ఆరో విడత హరితహారం కార్యక్రమం చేపట్టారు.
ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటని కాపాడాలి: కలెక్టర్
హరితహారం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ సూచించారు. నాటిన మొక్కలను కాపాడేందుకు కృషి చేయాలని పేర్కొన్నారు. అడవుల వల్ల కలిగే లాభాలను వివరించారు. మన లక్ష్యాన్ని ఆరో విడత హరితహారం కార్యక్రమంలో పూర్తి చేయాలన్నారు. అనంతరం స్థానికులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఇవీ చూడండి:హరితహారంలో కేసీఆర్.. నర్సాపూర్ అర్బన్ ఫారెస్ట్ ప్రారంభించిన సీఎం