కరోనా నివారణ చర్యల్లో భాగంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అధికార యంత్రాంగం మరింత కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. ఉమ్మడి జిల్లాలో కొవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య మొత్తం 38కి చేరుకోవడం వల్ల లాక్‌డౌన్‌ను మరింత కఠినంగా అమలుచేస్తున్నారు.
ఆదిలాబాద్‌లో 14 కేసులు, నిర్మల్ జిల్లాలో 19, కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 4, మంచిర్యాల జిల్లాలో ఒక కేసు నమోదైంది. క్షేత్రస్థాయిలో రాకపోకలను పూర్తిస్థాయిలో నియంత్రించారు.
రెడ్‌జోన్‌గా ప్రకటించిన నిర్మల్‌లో సంపూర్ణ లాక్‌డౌన్ కొనసాగుతోంది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లోని వ్యాధి ప్రభావిత ప్రాంతాల్లో ఆంక్షలను మరింత కఠిన తరం చేశారు. ఆదిలాబాద్‌లో స్వయంగా కలెక్టర్ శ్రీదేవసేన పరిస్థితిపై ఆరా తీస్తున్నారు. పాజిటివ్ వచ్చిన వారితో సన్నిహితంగా ఉన్న వ్యక్తుల రక్తనమూనాలను పరీక్షల కోసం హైదరాబాద్‌కు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇవీచూడండి:వైద్యులు ప్రాణాలను పణంగా పెడుతున్నారు: ఈటల