తెలంగాణ

telangana

ETV Bharat / state

సింగరేణి అధికారి బదిలీ అయితే సంబరాలు చేశారు! - సింగరేణి మేనేజింగ్ డైరెక్టర్ ప్రకాశరావు బదిలీ

అధికారులను బదిలీ చేస్తే రద్దు చేయాలంటూ ధర్నాలు, రాస్తారోకోలు, ఆందోళనలు చేసే సంఘటనలు చూస్తుంటాం. కానీ, ఓ సింగరేణి అధికారి బదిలీ కావడం వల్ల పీడ వదిలిందంటూ కేక్ కోసి సంబరాలు చేసుకున్న సంఘటన ఇది.

Singareni Managing Director Prakasarao Transfer Employees are feel very happy
అధికారి బదిలీ అయితే ఇలా కూడా చేస్తారా?

By

Published : Jul 9, 2020, 10:35 PM IST

సింగరేణి మేనేజింగ్ డైరెక్టర్ ప్రకాశరావు బదిలీ పట్ల రామకృష్ణాపూర్​లో ఆదిలాబాద్​ జిల్లా సూపర్ బజార్ ఉద్యోగులు సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా కేక్ కోసి అందరికీ పంచుతూ ఆనందం వ్యక్తం చేశారు. బదిలీ అయిన అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు.

సదరు అధికారి హయాంలో కమీషన్ల కోసం ఆశపడి అవసరం లేకపోయినా సరకులు కొనుగోలు చేశారని సంఘం ప్రధాన కార్యదర్శి శ్రీ రాములు మండిపడ్డారు. దీనివల్ల సంస్థకు నష్టం చేకూరిందని తెలిపారు. ఈ విషయమై విచారణ చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాక సిబ్బందిని కూడా తీవ్ర వేధింపులకు గురి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details