తెలంగాణ

telangana

ETV Bharat / state

సింగరేణి కార్మికులకు తీపికబురు.. దీపావళికి బోనస్ - Singareni workers information'

సింగరేణి యాజమాన్యం కార్మికులకు శుభవార్త అందించింది. ఏటా మాదిరే దీపావళి బోనస్‌తో ఈసారి సింగరేణి కార్మికులు పండుగ చేసుకోనున్నారు. ఈ మేరకు ఉత్తర్వులు విడుదల చేశారు. ఈ బోనస్‌ను ఈ నెల 12న కార్మికులకు చెల్లించనున్నారు.

singareni collieries gives big amount of bonus to employees for diwali
సింగరేణి కార్మికులకు తీపికబురు.. దీపావళికి బోనస్

By

Published : Nov 7, 2020, 6:51 PM IST

సింగరేణి కార్మికులకు దీపావళి బోనస్‌కు సంబంధించిన సర్క్యులర్ విడుదలైంది. ఈ నెల 12న కార్మికులకు సింగరేణి యాజమాన్యం బోనస్ చెల్లించనుంది. సింగరేణి సంస్థలో విధులు నిర్వహిస్తున్న కార్మికులకు ఈ నెల 12న దీపావళి (పీఎల్​ఆర్​) బోనస్​ను చెల్లించేందుకు నిర్ణయించినట్లు సంస్థ ఉత్తర్వులను జారీ చేసింది.

ఇటీవల జరిగిన జేబీసీసీఐ 10వ సమావేశంలో ఒప్పందం చేసుకున్న విధంగా రూ.68,500 బోనస్ చెల్లించనున్నట్లు అందులో పేర్కొంది. దీనికి గాను 2019–20 ఆర్థిక సంవత్సరంలో భూగర్భంలో విధులు నిర్వహించిన వారు 190 మస్టర్లు, గనులపై పనిచేసే వారు 240 మస్టర్లు కచ్చితంగా పూర్తి చేసి ఉండాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ పీఆర్​ఎస్​ బోనస్​ నాన్​ ఎగ్జిక్యూటివ్​, పదో వేజ్​ బోర్డు కిందకు వచ్చిన వారికి వర్తిస్తుందని తెలిపింది.

ఇదీ చదవండి:తపాలా సొమ్ము ఏ బ్యాంకుకైనా బదిలీ: సీపీఎంజీ

ABOUT THE AUTHOR

...view details