MLA Rekhanayak Join Congress Tomorrow : బీఆర్ఎస్ ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖ నాయక్ భర్త శ్యామ్ నాయక్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. జూబ్లీహిల్స్‌లోని రేవంత్ రెడ్డి నివాసంలో ఆయన్ను కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు ప్రకటించారు. పార్టీ కండువా కప్పి శ్యామ్ నాయక్‌ను పార్టీలోకి ఆహ్వానించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన బీఆర్ఎస్ అభ్యర్ధుల జాబితాలో రేఖనాయక్‌కు చోటు దక్కలేదు. రేఖనాయక్ స్థానంలో భూక్య జాన్సన్ రాథోడ్ నాయక్‌కు చోటు కల్పించారు. సీటు కోల్పవడంతో రేఖా నాయక్ భర్త శ్యామ్ నాయక్ సాయంత్రానికే కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. రేపు రేఖానాయక్ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే ప్రచారం జోరుగా నడుస్తోంది.
BRS Candidates List 2023 : తెలంగాణ రాష్ట్రంలో శాసనసభ ఎన్నికల యుద్ధానికి సమరం శంఖం పూరించిన ప్రభుత్వాధినేత కేసీఆర్.. తమ పార్టీ తరపున బరిలో నిలవబోయే గెలుపు గుర్రాల మొదటి జాబితాను విడుదల చేశారు. తొలి జాబితాలోనే ఏకంగా 115 మంది అభ్యర్థులకు (BRS MLA Candidates List 2023) టికెట్లు ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. కేసీఆర్ జాబితా ప్రకటనతో.. రాష్ట్రంలో ఎలక్షన్ సైరన్ మోగినట్టైంది. ఈ దఫా.. సిట్టింగుల్లో చాలా మందికి చోటు దక్కదనే ప్రచారం జరిగింది. దాదాపు 30 మంది వరకూ ఇంటికి వెళ్తారనే చర్చ జోరుగా సాగింది. కానీ.. అంచనాలను తారు మారు చేస్తూ.. స్వల్ప మార్పులు మాత్రమే చేపట్టారు కేసీఆర్. కేవలం 7 స్థానాల్లో మాత్రమే అభ్యర్థులను మారుస్తున్నట్టు ప్రకటించారు.
ఉమ్మడి అదిలాబాద్‌లో బీఆర్ఎస్ అభ్యర్థులు వీరే:
సిర్పూర్ - కోనేరు కోనప్ప
చెన్నూరు - బాల్క సుమన్
బెల్లంపల్లి - దుర్గం చెన్నయ్య
మంచిర్యాల- దివాకర్ రావు
అదిలాబాద్ - జోగు రామన్న
బోథ్ - అనిల్ జాదవ్
నిర్మల్ - ఆల్లోల ఇంద్రకరణ్ రెడ్డి
ముథోల్ -గడ్డి గారి విఠల్ రెడ్డి
ఆసిఫాబాద్- కోవా లక్ష్మి