ఆదిలాబాద్ జిల్లాలో కొవిడ్ -19 లాక్డౌన్ వెసులబాటులో భాగంగా దుకాణాలు తిరిగి తెరుచుకుంటున్నాయి. నిబంధనలను పాటించనివారిపై అధికార యంత్రాంగం కొరడా ఝులిపిస్తోంది. సరి, బేసి సంఖ్య నెంబర్లతో దుకాణాలు తెరుచుకోవడానికి పురపాలికలో అధికారులు అనుమతించారు.
సరి,బేసి సంఖ్యలతో తెరుచుకున్న దుకాణాలు.. అధికారుల నిఘా - odd and Even numbers in adilabad
ఆదిలాబాద్ పురపాలికలో కొవిడ్-19 లాక్డౌన్ నిబంధనలు ప్రభుత్వం సవరించిన కారణంగా దుకాణాలు సరి,బేసి సంఖ్యలో తెరుచుకుంటున్నాయి. ఈ మేరకు పుర పరిధిలో అధికారులు దుకాణాలను ఆకస్మికంగా తనిఖీలు చేపడుతున్నారు.
సరి,బేసి సంఖ్యలో తెరుచుకున్న దుకాణాలు
ఈ క్రమంలో ఆకస్మిక తనిఖీల కోసం ప్రత్యేక బృందాలను నియమించారు. మాస్కులు ధరించకుండా, భౌతిక దూరం పాటించని కొన్ని దుకాణలకు రూ.లక్షా 52 వేల వరకు జరిమానా విధించామంటున్న మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్‌తో ఈటీవీ భారత్ ప్రతినిధి మణికేశ్వర్ ప్రత్యేక ముఖాముఖి.