తెలంగాణ

telangana

ETV Bharat / state

బాసరలో మహాలింగార్చన - GODAVARI

మహాశివరాత్రి సందర్భంగా బాసరలో భక్తుల రద్దీ పెరిగింది. గోదావరి నదీ తీరంలో, సరస్వతిదేవి ఆలయంలో ప్రత్యేక పూజలతో కొత్త కాంతి నిండుకుంది.

బాసరలో మహాలింగార్చన

By

Published : Mar 4, 2019, 9:40 AM IST

బాసరలో మహాలింగార్చన
బాసర పుణ్యక్షేత్రంలో శివరాత్రి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. నేటి నుంచి మూడ్రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలను రుషికన్యలు వేదమంత్రోచ్ఛరణలతో ప్రారంభించారు. సూర్యేశ్వరస్వామికి వేకువజామున 3 గంటలకే అభిషేకం, బిల్వార్చన నిర్వహించారు. అనంతరం గోదావరి నదీ తీరంలో గంగమ్మ తల్లికి దీపారాధన, పుష్పార్చన చేశారు. మహాశివరాత్రి పురస్కరించుకొని మహాశివుడికి మహా రుద్రయాగం చేపట్టారు. నక్షత్ర, నాగ హారతులిచ్చారు. లింగాకృతిలో దీపాలను వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ రోజు సాయంత్రం 6 గంటలకు మహాలింగార్చన, లక్ష దీపాల ప్రజ్వలన ఉంటుందని ఆలయ అర్చకులు వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details