అటు కేంద్రం, ఇటు రాష్ట్రాల్లో రోజురోజుకు మహిళలపై అత్యాచారాలు, దాడులు జరుగుతున్నా పట్టించుకోవడం లేదంటూ ఆదిలాబాద్‌లో ఎస్‌ఎఫ్‌ఐ నిరసనకు దిగింది. తెలంగాణ తల్లి కూడలిలో అత్యాచారాలకు పాల్పడుతున్న నిందితుల దిష్టిబొమ్మను దగ్ధంచేసి తమ నిరసన వ్యక్తంచేశారు.
మహిళలపై అత్యాచారాలు, దాడులకు వ్యతిరేకంగా ఎస్‌ఎఫ్‌ఐ ఆందోళన - Adilabad district latest news
ఆదిలాబాద్‌లో ఎస్‌ఎఫ్‌ఐ నిరసన చేపట్టింది. రోజురోజుకు మహిళలపై అత్యాచారాలు, దాడులు జరుగుతున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదంటూ ఆందోళన నిర్వహించింది.
Breaking News
ఆయా ప్రభుత్వాల నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లో మైనర్ బాలికపై, ఉత్తరప్రదేశ్‌లో మహిళపై జరిగిన అత్యాచారం, హత్య ఘటనలో బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి కిరణ్ డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని, లేనిపక్షంలో ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
ఇదీ చూడండి:పాక్ దుశ్చర్యకు మరో ఇద్దరు భారత జవాన్లు బలి