తెలంగాణ

telangana

ETV Bharat / state

కరోనా కట్టడి కోసం గ్రామస్థుల స్వీయ నిర్బంధం

రాష్ట్రంలో రోజురోజుకు కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. కరోనా నేపథ్యంలో ఆదిలాబాద్​ జిల్లాలోని భీంపూర్​ గ్రామస్థులు వినూత్న నిర్ణయం తీసుకున్నారు. కొవిడ్​ కట్టడిలో భాగంగా స్వీయ నిర్బంధం పాటిస్తున్నారు. బయటి వ్యక్తులు గ్రామంలోకి రాకుండా పహారా కాస్తున్నారు.

self lockdown in bheempur village in adilabad district
కరోనా కట్టడి కోసం గ్రామస్థుల స్వీయ నిర్బంధం

By

Published : Jul 29, 2020, 12:48 PM IST

ఆదిలాబాద్ జిల్లాలో మండల కేంద్రమైన భీంపూర్ గ్రామస్థులు కరోనా విజృంభణ నేపథ్యంలో వినూత్న నిర్ణయం తీసుకున్నారు. బయటి వ్యక్తులు తమ గ్రామంలోకి రాకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. గ్రామ రహదారులన్నీ బారికేడ్లు కట్టి రాకపోకలకు అడ్డుకట్ట వేశారు. గ్రామస్థులు పంట చేలకు వెళ్లేలా ఒకదారిని మాత్రమే తెరిచి ఉంచారు.

కొత్తవారు ఆ దారి గుండా ప్రవేశించకుండా పహారా కాస్తున్నారు. కరోనా కట్టడిలో భాగంగా స్వీయ నిర్బందం పాటిస్తున్నట్లు సర్పంచి మాడావి లింబాజీ తెలిపారు. అత్యవసరం అయితే తప్ప ఇతర గ్రామాలకు వెళ్లకుండా గ్రామస్థులు కట్టుబడి ఉన్నట్లు పేర్కొన్నారు.

ఇవీ చూడండి: మృతుల కడసారి చూపులకు ప్రత్యేక భవనం

ABOUT THE AUTHOR

...view details