రైతులను ఖరీఫ్‌కి సన్నద్ధం చేయడానికి ఆదిలాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో వ్యవసాయ శాఖ, ఆత్మ సంస్థ ఆధ్వర్యంలో కిసాన్ మేళాను ఏర్పాటు చేశారు. పురుగు మందులు వాడకుండా అధీకృత డీలర్ల వద్దే నాణ్యమైన విత్తనాలు కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్ దివ్య దేవరాజన్ సూచించారు.
రైతులంతా తమ పంటలకు భీమా ప్రీమియం చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేళాకు వివిధ ప్రాంతాల నుంచి రైతులు భారీగా తరలివచ్చారు.
'అధీకృత డీలర్ల వద్దనే నాణ్యమైన విత్తనాలు కొనాలి' - AGRICLUTURE DEPARTMENT
ఖరీఫ్ సీజన్‌కు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను పూర్తి చేస్తోంది. వ్యవసాయ శాఖ సారథ్యంలో చేపట్టిన కిసాన్ మేళాలో రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
రైతులంతా పంటలకు భీమా ప్రీమియం చెల్లించాలి : కలెక్టర్
ఇవీ చూడండి : పోస్టింగుల కోసం టీఆర్టీ అభ్యర్థుల ఆందోళన