తెలంగాణ

telangana

ETV Bharat / state

జనసంద్రంగా నాగోబా జాతర.. కిక్కిరిసిన క్యూలైన్లు

నాగోబా జాతర ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది. రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్​ ఛైర్మన్​ ఎర్రోల్ల శ్రీనివాస్​ దేవతను దర్శించుకొని.. ప్రత్యేక పూజలు చేశారు.

nagoba jathara
nagoba jathara

By

Published : Feb 15, 2021, 7:16 PM IST

ఆదిలాబాద్‌ జిల్లా కేస్లాపూర్‌లోని ఆదివాసీల ఆరాధ్య దైవం నాగోబా ఆలయ ప్రాంగణం జనసంద్రంగా మారింది. జాతర ప్రారంభమై ఐదు రోజులు కావొస్తున్నా.. రోజు రోజుకూ భక్తుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. గంటల తరబడి క్యూలైన్లలో నిలబడి.. దేవతను దర్శించుకుంటున్నారు.

నాగోబా సన్నిధిలో మంత్రి ఇంద్రకరణ్​రెడ్డి, స్సీ, ఎస్టీ కమిషన్‌ ఛైర్మన్‌ ఎర్రొల్ల శ్రీనివాస్‌

నాగోబా దేవతను ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ ఛైర్మన్‌ ఎర్రోల్ల శ్రీనివాస్‌ దర్శించుకున్నారు. దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌, ఐటీడీఏ పీవో భవేష్‌ మిశ్రాలు ఘనస్వాగతం పలికారు. అనంతరం నాగోబా దేవతకు ప్రత్యేక పూజలు చేశారు.

భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. క్యూలైన్లు ఏర్పాట్లు చేసి.. దర్శన ప్రక్రియను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

జనసంద్రంగా నాగోబా జాతర.. కిక్కిరిసిన క్యూలైన్లు

ఇవీచూడండి:'చెట్టు, పుట్ట, చేనుతో మమేకమే వారి జీవన విధానం'

ABOUT THE AUTHOR

...view details