తెలంగాణ

telangana

ETV Bharat / state

Pollution Free Adilabad: 'ఆదిలాబాద్‌ పట్టణాన్ని కాలుష్య రహితంగా తీర్చిదిద్దుతాం'

ఆదిలాబాద్​ పట్టణ శివారులోని బంగారుగూడ డంపింగ్​ యార్డులో రూ.2.5 కోట్లతో నిర్మించిన పారిశుద్ధ్య వనరుల ఉద్యానవనాన్ని కలెక్టర్​ సిక్తా పట్నాయక్, స్థానిక ఎమ్మెల్యే జోగు రామన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ మొక్కలు నాటారు.

'ఆదిలాబాద్‌ పట్టణాన్ని కాలుష్య రహితంగా తీర్చిదిద్దుతాం'
'ఆదిలాబాద్‌ పట్టణాన్ని కాలుష్య రహితంగా తీర్చిదిద్దుతాం'

By

Published : Aug 17, 2021, 5:25 PM IST

ఆదిలాబాద్‌ పట్టణాన్ని కాలుష్య రహితంగా తీర్చిదిద్దుతామని జిల్లా పాలనాధికారి సిక్తా పట్నాయక్‌, ఎమ్మెల్యే జోగురామన్న పేర్కొన్నారు. పట్టణ శివారులోని బంగారుగూడ డంపింగ్‌ యార్డులో రూ.2.5 కోట్లతో నిర్మించిన పారిశుద్ధ్య వనరుల ఉద్యానవనాన్ని ప్రారంభించారు. అక్కడ చెత్త నుంచి సేంద్రీయ ఎరువుల తయారీ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. అనంతరం మొక్కలు నాటారు.

'ఆదిలాబాద్‌ పట్టణాన్ని కాలుష్య రహితంగా తీర్చిదిద్దుతాం'

పట్టణంలో చెత్త కారణంగా రోగాలు రాకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ప్రజలూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ ఛైర్మన్‌ జోగు ప్రేమేందర్‌, కమిషనర్​ శైలజా, ఇతర వార్డు కౌన్సిలర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

మొక్కలు నాటిన ఎమ్మెల్యే, కలెక్టర్

ఇదీ చూడండి: KTR: 'నాన్న నన్ను ఐఏఎస్ చేయాలనుకున్నారు... కానీ నేనేమి చేశానంటే..'

ABOUT THE AUTHOR

...view details