తెలంగాణ

telangana

ETV Bharat / state

సమత కేసు విచారణ రేపటికి వాయిదా

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సమత హత్యోదంతం కేసులో విచారణ చేపట్టిన ప్రత్యేక కోర్టు.. వాదనలు విన్న అనంతరం తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.

Samatha case  Postponed to tomorrow
సమత కేసు విచారణ రేపటికి వాయిదా

By

Published : Dec 26, 2019, 6:01 PM IST

సంచలనం సృష్టించిన సమత హత్యోదంతం కేసులో సాక్షుల విచారణ జరిగింది. ఆదిలాబాద్ ప్రత్యేక కోర్టుకి క‌ట్టుదిట్టమైన భద్రత నడుమ నిందితుల్ని తీసుకొచ్చారు. ఈ నెల 23, 24న 2రోజుల పాటు న్యాయస్థానం కేసును విచారించింది. నేడు మరోసారి సాక్షుల్ని విచారించారు. అదనపు పీపీ రమణారెడ్డి 9 మంది సాక్ష్యులను న్యాయస్థానంలో ప్రవేశపెట్టారు. నిందితుల తరఫున న్యాయవాది రహీం... సాక్షులను క్రాస్ ఎగ్జామిన్ చేశారు. ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఇరు వైపులా వాదనలు విన్నారు. కేసు విచారణను రేపటికి వాయిదా వేశారు.

సమత కేసు విచారణ రేపటికి వాయిదా

ABOUT THE AUTHOR

...view details