ఆదిలాబాద్‌లోని ప్రత్యేక కోర్టులో సాగుతున్న సమత కేసు విచారణ మంగళవారానికి వాయిదా పడింది. నిందితులు షేక్ బాబూ, షేక్ షాబొద్ధీన్, షేక్ మఖ్దూం తరఫున... కోర్టులో సాక్ష్యం చెప్పేందుకు ఎవరూ ముందుకురాలేదు. నిందితులకు మరో రోజు అవకాశం కల్పిస్తూ... ప్రత్యేక కోర్టు విచారణను రేపటికి వాయిదా వేసింది.
సమత కేసు: కోర్టుకు రాని సాక్షులు.. కేసు రేపటికి వాయిదా - samatha case latest news
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సమత కేసు విచారణ రేపటికి వాయిదా పడింది.
సమత తరఫున నమోదుచేసిన సాక్షుల సారాంశాన్ని.. ఈనెల మూడో తేదీన జరిగిన విచారణలో భాగంగా ప్రత్యేక కోర్టు.... నిందుతులకు వివరించింది. దాంతో.. తాము ఏ తప్పు చేయలేదని... పైగా తమ తరపున కూడా సాక్షులు ఉన్నట్లు నిందితులు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. విచారణను ఈనెల ఆరోతేదీ వరకూ వాయిదా పడింది. తిరిగి సోమవారం విచారణ ప్రారంభమైనప్పటికీ... నిందుతుల తరపున సాక్షులెవరూ రాలేదు. సాక్షులను ప్రవేశపెట్టడానికి... మరో అవకాశం ఇస్తూ... ప్రత్యేక కోర్టు విచారణను మంగళవారానికి వాయాదా వేసింది.
ఇవీ చూడండి: "నా భార్య, అత్త వేధింపులు తాళలేకే చనిపోతున్నా.."