తెలంగాణ

telangana

ETV Bharat / state

జాతీయ రహదారిపై ఆర్టీసీ కార్మికుల రాస్తారోకో

ఆదిలాబాద్​లో ఆర్టీసీ కార్మికులు జాతీయ రహదారిపై భైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

జాతీయ రహదారిపై ఆర్టీసీ కార్మికుల రాస్తారోకో

By

Published : Nov 8, 2019, 11:30 AM IST

డిమాండ్లను పరిష్కరించాలని ఆర్టీసీ కార్మికులు చేస్తున్న నిరవధిక సమ్మె 35వ రోజుకు చేరింది. ఆదిలాబాద్​ బస్టాండ్​ సమీపంలో దీక్షా శిబిరం ఏర్పాటు చేసి కార్మికులు సమ్మెను కొనసాగిస్తున్నారు. వివిధ పార్టీల మద్దతుతో పట్టణంలో కార్మికులు భారీ ప్రదర్శన నిర్వహించారు.

వివేకానంద చౌక్​లో జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేశారు. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వాహనాలు ఇరువైపులా నిలిచి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా డీఎస్పీ సత్యనారాయణ ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు.

జాతీయ రహదారిపై ఆర్టీసీ కార్మికుల రాస్తారోకో

ఇదీ చూడండి: 'తెలంగాణ ఆర్టీసీకి మా అనుమతి లేదు'

ABOUT THE AUTHOR

...view details