ఆదిలాబాద్లో ఆర్టీసీ సమ్మె రెండో రోజు ప్రశాంతంగా కొనసాగుతోంది. తొలిరోజు 50 బస్సులు నడపగా ఈరోజు అదనంగా మరో 10 బస్సులు నడుపుతున్నారు. ప్రయాణ ప్రాంగణం ప్రయాణికులతో కిటకిటలాడుతోంది. బస్సులన్నీ నిండాకే కదులుతుండడం వల్ల ప్రయాణికులు గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. టికెట్ ధరలు అధికంగా వసూలు చేస్తున్నారని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు రెండో రోజు కండక్టర్ల నియామకానికి నిరుద్యోగులు డిపోల ముందు బారులు తీరారు.
రెండో రోజు కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె - RTC STRICK IN ADILABAD
ఆదిలాబాద్లో ఆర్టీసీ కార్మికుల సమ్మె రెండో రోజు ప్రశాంతంగా కొనసాగుతోంది. కార్మికులు ఎవరు విధుల్లోకి హాజరు కాలేదు. అధికారులు ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు.
ఆర్టీసీ సమ్మె
TAGGED:
RTC STRICK IN ADILABAD