ఆదిలాబాద్ కలెక్టరేట్లో రవాణాశాఖ ఆధ్వర్యంలో రోడ్డు భద్రత కమిటీతో జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ సమావేశం నిర్వహించారు. రోడ్డు ప్రమాదాలు నిరోధించాలంటే మద్యం సేవించి వాహనాలు నడిపే వారికి త్వరితగతిన శిక్ష వేస్తే సత్ఫలితాలుంటాయని వెల్లడించారు. ఆసిఫాబాద్లో ఈ ప్రయోగం విజయవంతమై ప్రమాదాలు తగ్గుముఖం పట్టాయని తెలిపారు. ఈ సమావేశంలో ఎస్పీ విష్ణు, జేసీ సంధ్యారాణి పాల్గొన్నారు.
'జైలుకి పంపిస్తే ప్రమాదాలు తగ్గుతాయి'
మద్యం సేవించి వాహనాలు నడిపే వారిని ఒకటి రెండు రోజులు జైల్లో ఉండేలా శిక్ష విధిస్తే సత్ఫలితాలుంటాయని ఆదిలాబాద్ జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పేర్కొన్నారు.
జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ సమావేశం