నాలుగు నెలలుగా తమకు వేతనాలు చెల్లించడం లేదంటూ ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రి ఔట్ సోర్సింగ్ సిబ్బంది భిక్షాటన చేశారు. జీతాల్లేక నానా అవస్థలు పడుతున్నామని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు.
వినూత్న నిరసన.. రిమ్స్ కార్మికుల భిక్షాటన - ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రి పొరుగు సేవల సిబ్బంది నిరసన
ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రి పొరుగు సేవల సిబ్బంది వినూత్నంగా నిరసన తెలియజేశారు. నాలుగు నెలలుగా జీతాలు రాకపోవడంపై భిక్షాటన చేస్తూ ఆవేదన వ్యక్తం చేశారు.
![వినూత్న నిరసన.. రిమ్స్ కార్మికుల భిక్షాటన RIMS out sourcing employees nirasana on not giving salaries last four months in Adilabad district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11032882-87-11032882-1615898304645.jpg)
వినూత్న నిరసన.. రిమ్స్ కార్మికుల భిక్షాటన
వేతనాలు ఇవ్వడం లేదని వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. తమ పట్ల రిమ్స్ డైరెక్టర్, గుత్తేదారుల నిర్లక్ష్యంపై కార్మికులు మండిపడ్డారు. సకాలంలో వేతనాలు చెల్లించకపోతే నిరవధిక సమ్మె చేస్తామని హెచ్చరించారు.