తెలంగాణ

telangana

ETV Bharat / state

రిమ్స్​లో నర్సుల ఆందోళన ఉద్ధృతం - ఆదిలాబాద్ లేటెస్ట్ న్యూస్

వేతన బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రి నర్సులు చేపట్టిన నిరసన ఉద్ధృతం చేశారు. కలెక్టరేట్​ ఎదుట బైఠాయించారు. నాలుగు రోజుల నుంచి విధులు బహిష్కరించి సమ్మె చేస్తున్నారు.

rims nurse protest at collectorate for pending salaries
రిమ్స్ నర్సుల ఆందోళన ఉద్ధృతం

By

Published : Dec 7, 2020, 12:17 PM IST

ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రి నర్సులు తమ ఆందోళనను ఉద్ధృతం చేశారు. వేతన బకాయిలను చెల్లించాలని నాలుగు రోజులుగా విధులు బహిష్కరించి సమ్మె బాట పట్టిన నర్సులు... కలెక్టరేట్ ఎదుట బైఠాయించారు. రిమ్స్ నుంచి నినాదాలు చేస్తూ కలెక్టరేట్​కు చేరుకున్నారు.

కలెక్టరేట్ ప్రధాన ద్వారం ఎదుట బైఠాయించి రాకపోకలు నిలిపివేశారు. వేతన బకాయిలు చెల్లించే వరకు తమ ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:తెలంగాణకు కోటిన్నర కొవిడ్ టీకాలు.. సర్కారు ప్రణాళికలు

ABOUT THE AUTHOR

...view details