ఉపకార వేతనాలు చెల్లించాలంటూ ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రి జూనియర్ వైద్యులు నిరసన బాట పట్టారు. మూడు రోజులుగా శాంతియుత నిరసన తెలుపుతున్న తామంతా రేపటి నుంచి నిరవధిక సమ్మెకు దిగుతున్నట్లు తెలిపారు. తమకు రావాల్సిన ఉపకారవేతనాలు.. ఖాతాలలో జమ చేయాలని నినాదాలు చేశారు. ఎనిమిది నెలలుగా వేతనాలు రాక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తంచేశారు.
రేపటి నుంచి రిమ్స్ ఆస్పత్రి జూడాల నిరవధిక సమ్మె - రిమ్స్ ఆస్పత్రి తాజా వార్తలు
ఎనిమిది నెలలుగా ఉపకార వేతనాలు లేక ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రి జూనియర్ వైద్యులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ మేరకు వేతనాలు చెల్లించాలంటూ మూడు రోజుల నుంచి ఆస్పత్రి ఎదుట నిరసన చేపట్టారు. అయినప్పటికీ యాజమాన్యం నుంచి స్పందన లేకపోవడంతో రేపటి నుంచి నిరవధిక సమ్మెకు దిగుతున్నట్లు జూడాలు స్పష్టం చేశారు.
రేపటి నుంచి రిమ్స్ ఆస్పత్రి జూడాల నిరవధిక సమ్మె
ఇప్పటికే సమ్మె నోటీసును డైరెక్టర్‌కు అందజేసినట్లు తెలిపిన జూడాలు, జరిగే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని స్పష్టంచేశారు. సమ్మె చేస్తే అత్యవసర సేవలతో పాటు ఓపీ సేవలకు కూడా వెళ్లేది లేదని పేర్కొన్నారు.
ఇదీ చదవండి:ఆ ఇద్దరు కలిశారు.. అద్భుతం చేశారు..