కొవిడ్ వార్డులో పనిచేసేందుకు వీలుగా పీపీఈ కిట్లు, గ్లౌజులు, మాస్కులు ఇవ్వాలంటూ ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రి పారిశుద్ధ్య సిబ్బంది ఆందోళన బాటపట్టారు. విధులు బహిష్కరించిన దవాఖానా ఎదుట నిరసన తెలిపారు. నిరసనకారుల వద్దకు రిమ్స్ డైరెక్టర్ బలరాం చేరుకుని హామీ ఇవ్వడం వల్ల వారు ఆందోళన విరమించారు.
రిమ్స్ ఆసుపత్రి పారిశుద్ధ్య కార్మికుల ధర్నా
కరోనా నేపథ్యంలో అలుపెరగకుండా రేయింబవళ్లు వ్యాధిగ్రస్తులకు సేవలందిస్తున్న ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రి పారిశుద్ధ్య కార్మికులు ఆందోళన చేపట్టారు. అహర్నిశలు శ్రమిస్తున్న తమకు కరోనా రక్షణ కిట్లు అందిచాలంటూ నిరసన తెలిపారు.
రిమ్స్ ఆసుపత్రి పారిశుద్ధ్య కార్మికుల ధర్నా