ఆదిలాబాద్ జిల్లా ముథోల్ నియోజకవర్గంలోని అన్ని తహసీల్దార్ కార్యాలయాల ముందు వీఆర్ఓ, వీఆర్ఏలు ధర్నా నిర్వహించారు. రెవెన్యూశాఖను రద్దు చేసి పంచాయతీరాజ్‌శాఖ, వ్యవసాయశాఖలో విలీనం చేయాలనే ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్నోఏళ్లుగా సేవలందిస్తున్న రెవెన్యూ వ్యవస్థను రద్దు చేయడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు. సమగ్ర సర్వే చేసి, భూ రికార్డులను ఆధునీకరించాలని కోరారు.
ముథోల్ నియోజకవర్గంలో రెవెన్యూ ఉద్యోగుల నిరసన - revenue employees protest
రెవెన్యూశాఖ రద్దు నిర్ణయాన్ని విరమించుకోవాలని ముథోల్ నియోజకవర్గ వ్యాప్తంగా వీఆర్ఓ, వీఆర్ఏలు తహసీల్దార్ కార్యాలయాల ముందు ధర్నా నిర్వహించారు.
![ముథోల్ నియోజకవర్గంలో రెవెన్యూ ఉద్యోగుల నిరసన](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4479520-thumbnail-3x2-revenue.jpg)
రెవెన్యూ ఉద్యోగుల నిరసన