ఆదిలాబాద్ జిల్లా తాంసి మండల కేంద్రంలో వీఆర్వో రోహిత్‌పై దాడి.. రెవెన్యూ అధికారుల, ఉద్యోగుల నిరసనకు దారితీసింది. దాడికి పాల్పడిన వారిని అరెస్టు చేయాలని కలెక్టర్ సిక్తాపట్నాయక్‌కు ఉద్యోగులు వినతిపత్రం అందజేశారు. అనంతరం రెవెన్యూ సంఘభవన ఆవరణలో నిరసన చేపట్టారు.
తనపై దాడి వెనక స్థానిక రాజకీయనాయకుల ప్రాబల్యం ఉందని వీఆర్వో ఆరోపించారు. రైతులకు దాడిచేయాలనే ఉద్దేశం లేకున్నా నాయకులు వారిని ప్రేరేపించారని అన్నారు. రైతుల సమ్మతంతోనే శెత్వారీ కంటే ఎక్కువ ఉన్న భూమిని తొలగించామని స్పష్టం చేశారు. అయినా తమ భూమి తమకు ఇప్పించాలని గొడవకు దిగినట్లు తెలిపారు.