తెలంగాణ

telangana

ETV Bharat / state

పైసలకు పట్టాలిస్తాం... రండి బాబూ రండి... - revenue employees give land pass book without rules in adilabad

రెవెన్యూ అధికారులపై ఎన్ని అవినీతి ఆరోపణలు వస్తున్న కొంత మంది అధికారుల తీరు మారడం లేదు. ప్రభుత్వ భూములను ఇతరులు ఆక్రమిస్తే.. అడ్డుకోవాల్సిన వారే నిబంధనలకు విరుద్ధంగా పట్టాలిస్తూ జేబులు నింపుకుంటున్నారు. కింది స్థాయి సిబ్బందికి తెలియకుండా లక్షలు మింగేస్తున్నారు. ఎకరానికి రూ.15 చొప్పున వసూలు చేస్తూ అవినీతికి కేరాఫ్​ అడ్రస్​గా నిలుస్తున్నారు ఆదిలాబాద్​ జిల్లా భీంపూర్ రెవెన్యూ అధికారులు.

revenue employees give land pass book without rules in adilabad
పైసలకు పట్టాలిస్తాం... రండి బాబూ రండి...

By

Published : Dec 23, 2019, 12:05 AM IST

పైసలకు పట్టాలిస్తాం... రండి బాబూ రండి...
అవినీతికి పాల్పడుతూ లక్షలు సంపాదిస్తున్నారు కొంత మంది రెవెన్యూ అధికారులు. అడ్డదారిలో పట్టాలిస్తూ ప్రభుత్వానికి, ప్రజలకు నష్టం చేస్తున్నారు. ఆదిలాబాద్​ జిల్లా భీంపూర్​ శివారులో ప్రభుత్వ భూమిని అక్రమార్కులకు కట్టబెడుతున్నారు అధికారులు. ఇప్పటి వరకు 41 మందికి లక్షల విలువైన ఎకరాలకు పట్టాలు ఇచ్చారు. గ్రామ రెవెన్యూ అధికారికి తెలియకుండా పై స్థాయిలోనే అవినీతికి పాల్పడుతున్నారు.

నిబంధనలకు విరుద్ధంగా
నిబంధనల ప్రకారం ప్రభుత్వ భూమిని ఎవరైనా సాగు చేస్తే పాలనాధికారి ప్రత్యేక ఉత్తర్వులతో గానీ, ఆర్డీవో, ఎమ్మెల్యే సభ్యులుగా ఉన్న కమిటీ ఆమోదం మేరకు పట్టాలు జారీ చేసే వెసులుబాటు ఉంటుంది. ఇందుకు విరుద్ధంగా నిబంధనలు పాటించకుండా గుడిలోని సర్వే నంబర్ 19 లో 55 ఎకరాలు 24 మంది పేరిట, కరంజి శివారులోని సర్వే నంబరు 143లో 45 ఎకరాలను 15 మందికి, గోముత్రి శివారులోని సర్వే నంబర్ 56లో ఇద్దరు రైతుల పేర 8 ఎకరాల భూమికి పట్టా ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.

తహసీల్దార్ వత్తాసు

ఇలా పట్టాలివ్వడానికి ఎకరాకు రూ.15వేల చొప్పున వసూలు చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. మరోవైపు సంబంధిత సర్వే నంబర్లలో ఏళ్లుగా సాగు చేస్తున్న ఆదివాసీలకు మాత్రం పట్టాలు ఇచ్చేందుకు అధికారులు వెనకాడుతున్నారు. ఈ అక్రమాల్లో వీఆర్వోలుగా ఇంఛార్జీ బాధ్యతలు నిర్వర్తిస్తున్న ముగ్గురు వీఆర్ఏలు, ధరణి ఆపరేటర్ పాత్ర ఉన్నట్లు... వారికి తహసీల్దార్ వత్తాసు పలికినట్లు ఆరోపణలు వస్తున్నాయి.

పైసలకు పట్టాలిస్తాం... రండి బాబూ రండి...

తప్పు ఒప్పుకున్న తహసీల్దార్

ఈ వ్యవహారంలో ఆయా గ్రామాల్లోని అధికార పార్టీ నాయకులు మధ్యవర్తులుగా వ్యవహరించి డబ్బులు వసూలు చేశారని ప్రచారం జరుగుతోంది. ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపితే అసలు బండారం బయట పడే అవకాశం ఉంది. ఈటీవీ భారత్ చరవాణిలో తహసీల్దార్ మల్లేష్​ను వివరణ కోరగా ఆ పట్టాలను వెంటనే రద్దు చేస్తామని వెల్లడించారు.

ఇదీ చూడండి: ఆకట్టుకున్న కంబైన్డ్​ పాసింగ్​ పరేడ్​.. విమానాల విన్యాసాలు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details