Revanth Reddy Speech in Boath Meeting Today :ఆదివాసీలు, లాంబాడాలు కాంగ్రెస్ పార్టీకి రెండు కళ్లలాంటివారని.. రేవంత్‌రెడ్డి(Revanth reddy) పేర్కొన్నారు. బోథ్‌లో జరిగిన కాంగ్రెస్ విజయభేరి సభలో ఆయన ఈ మేరకు ప్రసంగించారు. కేసీఆర్(CM KCR) వల్ల బోథ్‌కు నీళ్లు రాలేదని దుయ్యబట్టారు. బోథ్ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అధికారంలోకి రాగానే ఆదిలాబాద్‌ను అభివృద్ధి పథంలో నడిపిస్తామని.. జిల్లాను దత్తత తీసుకుంటానని రేవంత్ హామీ ఇచ్చారు.
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవకపోతే యువత అడవిబాటే : రేవంత్ రెడ్డి
Telangana Assembly Elections 2023 :తెలంగాణలో 12 అసెంబ్లీ స్థానాల్లో 6 లాంబాడాలకు, 6 ఆదివాసీలకు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించిందన్నారు. బలరాం నాయక్ పెద్ద మనసుతో ఆదివాసీ బిడ్డకోసం ఇల్లందు సీటు వదులుకుండని.. పదవి కంటే ప్రజలకు మేలు జరగడం ముఖ్యమని ఆయన తన ఎమ్మెల్యే టికెట్ త్యాగం చేశారన్నారు. ఓటు చీలిపోకుండా చూడాల్సిన బాధ్యత మీపై ఉందని రేవంత్‌రెడ్డి అన్నారు. ఇక్కడి ప్రజలకు పోడు భూములకు పట్టాలు ఎందుకివ్వలేదని అడిగారు. తండాలను పంచాయితీలు చేశామని చెప్పుకునే కేసీఆర్.. ఇంతవరకు ఎన్ని పంచాయతీలకు భవనాలు కట్టించారన్నారు.
Revanth Reddy Comments on CM KCR :గ్రామ సర్పంచులకు వేల కోట్ల బకాయిలు ఇవ్వక ప్రభుత్వం వారిని ఆత్మహత్యలకు ఉసిగొల్పిందని మండిపడ్డారు. కేసీఆర్ తన మేధస్సును రంగరించి కాళేశ్వరం కట్టిన అని చెప్తుండు.. కానీ మేడిగడ్డ కట్టిన మూడేళ్లలో కుంగిపోయింది.. అన్నారం పగిలిపోయిందని విమర్శించారు. బోథ్‌కు నీళ్లు రాకపోవడానికి ఈ దద్దమ్మ సీఎం కేసీఆరే కారణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడి కుఫ్టీ ప్రాజెక్టు పూర్తి కావాలంటే.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని పిలుపునిచ్చారు.