ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పరేడ్ మైదానంలో 72వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కలెక్టర్ సిక్తా పట్నాయక్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఎస్పీ విష్ణు ఎస్ వారియర్ సమక్షంలో పోలీసు గౌరవ వందనం స్వీకరించారు.
పాలనాధికారి సిక్తా పట్నాయక్ జిల్లా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సంక్షేమ పథకాలు అమలవుతున్న తీరును వివరించారు. వ్యవసాయ పెట్టుబడి సాయంలో భాగంగా ఖరీఫ్ రూ. 264. 03 కోట్లు, యాసంగిలో మరో రూ. 239.85 కోట్లు రైతు బంధు సాయం చేసినట్లు వెల్లడించారు.