ఆదిలాబాద్లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే 409 యాక్టివ్ కేసులు ఉండగా... మరో 16 మంది మృతిచెందారు. జిల్లాలోని ఆదిలాబాద్ పట్టణం, నేరడిగొండ, బోథ్, ఇచ్చోడ, ఉట్నూర్, జైనథ్ ప్రాంతాల్లో వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంది.
పట్టణంలో విస్తృతంగా కొవిడ్ పరీక్షలు - తెలంగాణ కరోనా వార్తలు
ఆదిలాబాద్ పట్టణంలో కొవిడ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. వైరస్ వ్యాప్తి ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో అధికారులు వ్యాధి నిర్ధరణ పరీక్షలను మరింత పెంచారు.
పట్టణంలో విస్తృతంగా కొవిడ్ పరీక్షలు
వైరస్ వ్యాప్తి ముమ్మరంగా ఉన్న ప్రాంతాల్లో ముందస్తు నివారణ చర్యల్లో భాగంగా జిల్లా వైద్యారోగ్యశాఖ వ్యాధి నిర్ధారణ పరీక్షలను మరింత పెంచింది. ప్రధానంగా ఆదిలాబాద్ పట్టణ పరిధిలోని మురికివాడలైన హమాలివాడ, ఖుర్షీద్ నగర్, క్రాంతి నగర్, భుక్తాపూర్, ఖానాపూర్ కాలనీల్లో 104 వాహనాల్లో ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టింగ్ కిట్ ద్వారా పరీక్షలు నిర్వహిస్తున్నారు.
ఇదీ చూడండి:ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టిన కారు.. నిందితులు పరార్