రంజాన్ వేళ వెలవెలబోయిన ఈద్గాలు... - రంజాన్ వేళ వెలవెలబోయిన ఈద్గాలు...
లాక్డౌన్ ప్రభావం రంజాన్ పండుగపై పడింది. ప్రార్థనలతో కోలాహలంగా దర్శనమిచ్చే ఈద్గాలన్ని వెలవెలబోయాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ముస్లీంలు అత్యంత నిరాడంబరంగా పండుగను జరుపుకున్నారు.
Breaking News
పూర్వ ఆదిలాబాద్ జిల్లాలో పవిత్ర రంజాన్ పర్వదినాన్ని ముస్లీంలు అత్యంత నిరాడంబరంగా జరుపుకున్నారు. కరోనా నియంత్రణ కారణంగా తొలి సారిగా ఈద్గాలన్నీ వెలవెలబోయాయి. ఆదిలాబాద్, ఉట్నూర్, ఇచ్చోడ, నిర్మల్, భైంసా, మంచిర్యాల లాంటి పట్టణాల్లో ఈద్గాల్లో ప్రార్థనలు జరగలేదు. పరిమిత సంఖ్యలో కొంతమంది తమ పూర్వీకుల సమాదుల వద్ద ప్రార్థనలు నిర్వహించారు. మిగతావారు ఇళ్లలోనే భౌతికదూరం పాటిస్తూ ప్రార్థనలు నిర్వహించారు.