ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్, ఇంద్రవెల్లి, నార్నూర్ మండలాల్లోని పలు ప్రాంతాల్లో ఉదయం నుంచి వర్షం కురుస్తున్నందున ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మండలాల్లో ఉదయం నుంచి దట్టమైన మేఘాలు కమ్ముకున్నాయి. ఉరుములు మెరుపులతో పాటు వర్షం కురుస్తోంది. రోడ్లపై నిలిచిన వాన నీటితో ఆయా మండలాల ప్రజలు ఇళ్ల నుంచి వచ్చేందుకు అవస్థలు పడుతున్నారు.
ఏజెన్సీలో వర్షం.. పంట నష్టపోయామని రైతుల ఆవేదన - వర్షాలతో రైతులకు పంటనష్టం ఉట్నూరు ఏజెన్సీ
ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ డివిజన్లోని ఏజెన్సీ ప్రాంతాల్లో ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. దీంతో ప్రజలు, వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. మారుమూల గ్రామీణ ప్రాంతాల్లోని వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు.
ఏజెన్సీలో వర్షం.. పంట నష్టపోయామని రైతుల ఆవేదన
చేతికొచ్చిన సోయా పంటతో పాటు పత్తి పంట నల్లపడుతుందని మండలాల్లోని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట నష్టపోయిన అన్నదాతలను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.
ఇదీ చదవండి:హైదరాబాద్లో భారీ వర్షం.. రోడ్లన్నీ జలమయం